Reading Time: < 1 minute

తక్కువధరకు గోల్డ్ తెప్పిస్తానని రూ.2కోట్లు కొట్టేసిండు..నిందితుడిని పట్టుకున్న CCS పోలీసులు

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: దుబాయ్, శ్రీలంకల నుంచి తక్కువ ధరకే గోల్డ్​బిస్కెట్లు తెప్పిస్తానని నమ్మించి రూ.2 కోట్లు కాజేసిన నేరస్తుడిని హైదరాబాద్​సీసీఎస్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలం అయ్యవారిపల్లికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు తెప్పించి ఇస్తానని వాట్సాప్ ద్వారా వీడియోలు పంపి పలువురిని నమ్మించాడు. వారి వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకున్నాడు. గోల్డ్​బిస్కెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న సనత్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన రాకేశ్ బలరాం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని బుధవారం అరెస్ట్​చేశారు. అతనిపై గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్, నమ్మకద్రోహం, ఆర్థిక మోసాలకు సంబంధించి 6 కేసులున్నట్లు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.