Reading Time: < 1 minute

విజయ్ సర్కార్ : పండగ చేస్తున్న ఫ్యాన్స్

Caption of Image.

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. 2026 మే 09వ తేదీన VCK, IUML పార్టీలు టీవీకే విజయ్ పార్టీకి అధికారికంగా మద్ధతు తెలుపుతుండటంతో.. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఉన్న ఊగిసలాట తొలగిపోయింది. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారమే తరువాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పండగంటే మామూలుగా కాదు.. పూనకాలు వచ్చినట్లే అనుకోండి. 

విజయ్ ఫ్యాన్స్ ను డైహార్ట్ ఫ్యాన్స్ అనాలి ఎందుకంటే. తమ అభిమాన నటుడు, నాయకుడు సీఎం అందరికంటే మెజారిటీ సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ఇతర పార్టీల మద్ధతు అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనతో.. మామూలు రచ్చ చేయలేదు. ఎవరికి వారు ధర్నాలకు దిగారు. గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కుట్రల వల్లే ఇతర పార్టీలు మద్ధతు ఇచ్చేందుకు సంకోచిస్తున్నట్లు ఆరోపించారు . అంతే కాదు ఏకంగా పార్టీ ఆఫీసుల ముట్టడికి సిద్ధపడ్డారు. వారిని ఆపేందుకు పోలీసులకు ఒక తరంకాలేదంటే నమ్మాలి. 

విజయ్ ఫ్యాన్స్ అంటే మామూలా మరి.. టీవీకే గెలవదు అని ఫ్రెండ్స్ సరదగా బెట్ కడితేనే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు ఒక అభిమాని. అంత డైహార్ట్ ఫ్యాన్స్ సీఎం కానీయకుండా అడ్డుకుంటే ఊరుకుంటారా. సునామీకి ముందు సముద్రం ఊగినట్లుగా ఆవేశపడుతూ ఉన్న సమయంలో.. ఎట్టకేలకు సీఎం విజయ్.. అనే తీపికబురుతో శాంతించారు. ఆవేశం కాస్త ఉల్లాసంగా మారిపోయింది. 

►ALSO READ | కేరళకు వెళ్లనున్న తమిళనాడు గవర్నర్ : ఈలోపు విజయ్ కలుస్తారా లేదా..?

ప్రతి నియోజకర్గంలోని టీవీకే పార్టీ కార్యాలయాల ముందు బాణా సంచా కాల్చుతూ నానా హంగా చేస్తున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. డ్యాన్సులు, కోలాహలం.. చెప్ప వశం కానంత ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రమాణ స్వీకారం ఎప్పుడా.. వెళ్లి గ్రౌండ్ అంతా హోరెత్తించాలనే ఉత్సాహాన్ని ఒడిసిపట్టి ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి.. ప్రమాణ స్వీకారం ముందూ, తర్వాత.. టీవీకే జెండాలు ఎలా ఎగురుతాయో.. ఫ్యాన్స్ పూనకాలతో ఎలా ఊగిపోతారో. మరి కొన్ని గంటల్లోనే అది కూడా జరగబతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

©️ VIL Media Pvt Ltd.