
Asian Games 2026 Medals: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు (Asian Games 2026) రోజుకో కొత్త అంశంతో వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఈ క్రీడల్లో విజేతలకు అందజేసే పతకాల (Medals) డిజైన్ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రియులు ఫిదా అవుతున్నారు. ప్రఖ్యాత జపనీస్ డిజైనర్ డైసుకే షీబా (Daisuke Shiba) తీర్చిదిద్దిన ఈ పతకాల వెనుక వినూత్న ఆలోచనతో పాటు మైండ్ బ్లాకింగ్ క్రియేటివిటీ దాగి ఉంది.
ఇమేజిన్ వన్ ఏషియా – డిజైన్ వెనుక స్టోరీ ఇదే:
జపాన్‌లో నిర్వహించిన ఒక జాతీయ స్థాయి పోటీ ద్వారా ఈ మెడల్స్ డిజైన్‌ను ఎంపిక చేశారు.
* థీమ్ & మెసేజ్: ఆసియా గేమ్స్ అధికారిక నినాదమైన ఇమేజిన్ వన్ ఏషియా (Imagine One Asia), వైవిధ్యంలో ఏకత్వం అన్న కాన్సెప్ట్‌తో దీనిని రూపుదిద్దారు.
* అథ్లెట్ల కష్టం: క్రీడాకారులు సాధన చేసే సమయంలో ఎదుర్కొనే గాయాలు, ఓటములు, కష్టనష్టాల నుంచి సాధించే విజయం వరకు ఉన్న పూర్తి ప్రయాణాన్ని ఈ పతకాల డిజైన్ ప్రతిబింబిస్తుందని డిజైనర్ వెల్లడించారు.
ఈ-వేస్ట్‌తో గోల్డ్ మెడల్స్:
* ఈ పతకాల తయారీలోనే అసలైన మ్యాజిక్ దాగి ఉంది. జపాన్ మున్సిపాలిటీలు సేకరించిన పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల (E-Waste) నుంచే ఈ లోహాలను రీసైక్లింగ్ చేసి మెడల్స్‌గా తయారు చేశారు.
* ఐచి సంస్కృతి: పతకానికి కట్టే రిబ్బన్‌పై ఐచి ప్రాంతపు అధికారిక పువ్వు కాకిత్సుబాతా (Kakitsubata) ఆకారాన్ని అత్యంత సుందరంగా చిత్రించారు.
* హినోకి చెక్క బాక్స్: మెడల్స్‌ను భద్రపరిచేందుకు ఇచ్చే ప్రత్యేక బాక్స్‌ను ఐచి ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హినోకి (Hinoki) చెక్కతో రూపొందించడం మరో హైలైట్.
సైజులు, బరువులు ఇవే:
* ఈ పతకాలు 8 సెంటీమీటర్ల వ్యాసం, 5 సెంటీమీటర్ల మందంతో లగ్జరీ లుక్‌లో తీర్చిదిద్దబడ్డాయి.
* గోల్డ్ మెడల్: 265 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని స్వచ్ఛమైన వెండిపై ఒక గ్రాము బంగారం పూత పూసి రూపొందించారు.
* సిల్వర్ మెడల్: 264 గ్రాముల బరువుతో పూర్తిగా స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు.
* బ్రౌంజ్ మెడల్: 222 గ్రాముల బరువుతో 95 శాతం రాగి, 5 శాతం జింక్ మిశ్రమంతో సిద్ధం చేశారు.
* సాంస్కృతిక వారసత్వానికి పర్యావరణ పరిరక్షణను జోడించి జపాన్ రూపొందించిన ఈ పతకాలు ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.