Reading Time: 2 minutes

Ashu Reddy : కేసుల నుంచి తప్పుకునేందుకే ఈ విన్యాసాలా? అషురెడ్డి ఫేక్ ఎంగేజ్‌మెంట్‌పై నెటిజన్ల ఫైర్!

Caption of Image.

బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి ఎప్పుడు ఏం చేసినా అదో సంచలనమే. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నిన్న ( ఏప్రిల్ 8, 2026 )ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ.. ఓ మిస్టరీ మ్యాన్ చేతిలో చేయి వేసి ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. అయితే, ఆమె చుట్టూ ఉన్న కాంట్రవర్సీల నేపథ్యంలో ఈ పెళ్లి ముచ్చట నిజమేనా అంటూ అంతా సందేహం పడ్డారు. లేటెస్ట్ గా ఈ వైరల్ ఎంగేజ్‌మెంట్‌పై అషురెడ్డి క్లారిటీ ఇస్తూ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

ఫేక్ నిశ్చితార్థం వెనుక ..

అషురెడ్డి లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిఫికేషన్ ఇస్తూ.. కళ్లతో చూసేది, చెవులతో వినేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. రియల్‌గా అనిపించే ప్రతిదీ నిజం కాదు.. నమ్మే ముందు ఆలోచించండి అంటూ అసలు గుట్టు విప్పింది. నిజానికి ఆ ఫొటోలు ‘జియోహాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనివి. అందులో ఆమెతో కనిపించిన ఆ మిస్టరీ హ్యాండ్ మరెవరిదో కాదు.. బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్‌ది! ఆ సిరీస్ ప్రమోషన్స్ కోసమే అషురెడ్డి ఇలా ప్రాంక్ చేయడంతో జనాలు తలలు పట్టుకుంటున్నారు. కేసుల నుంచి జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రూ.9.5 కోట్ల చీటింగ్ కేసు!

ఈ ఎంగేజ్‌మెంట్ సస్పెన్స్‌కు అంత క్రేజ్ రావడానికి మరో ముఖ్య కారణం ఉంది. ఆమె చుట్టూ నడుస్తున్న కోర్టు కేసులు. ధర్మేంద్ర అనే ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తనను పెళ్లి పేరుతో నమ్మించి అషురెడ్డి దాదాపు రూ.9.5 కోట్లు నొక్కేసిందని హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భారీ మోసం కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ అషురెడ్డి, ఆమె తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. దీనికితోడు, సోమవారం విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ పోలీసులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు.

►ALSO READ | Japan Kumar Viral Video: హోటల్లో సర్వర్గా విజయ్ కో స్టార్.. వైరల్ వీడియోపై జపాన్ కుమార్ భార్య క్లారిటీ

వివాదాల కేరాఫ్ అడ్రస్!

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషురెడ్డి.. బిగ్‌బాస్‌తో క్రేజ్ తెచ్చుకుంది. గ్లామరస్ ఫొటోషూట్లు, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) తో ఆమె చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు గతంలో పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కోట్లలో చీటింగ్ కేసు నడుస్తున్న టైమ్‌లో కూడా ఇలాంటి ‘ఫేక్ ఎంగేజ్‌మెంట్’ గిమ్మిక్కులతో అషురెడ్డి వార్తల్లో నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

 

©️ VIL Media Pvt Ltd.