Reading Time: 2 minutes
Rahul Gandhi Indore Students Cannot See Future In System

ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థులే భారతదేశ భవిష్యత్ అని అన్నారు. విద్యార్థులు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని చెప్పారు. విద్యార్థులు విభిన్న లక్షణాలుంటాయని.. వారు సహజంగానే ప్రశ్నలు అడుగుతారని పేర్కొన్నారు. విద్యార్థులు జిజ్ఞాసతో ఉంటారని.. వారు ఇతర సిద్ధాంతాలను, ఇతర ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారన్నారు. వారు పోట్లాడరు.. బెదిరించరు.. భయపెట్టరని పేర్కొన్నారు. అత్యంత ముఖ్యమైన గుణం ఏంటంటే.. విద్యార్థులు నిజాయితీపరులు.. వారు నిజాయితీగా పని చేస్తారని తెలిపారు.

విద్యార్థులు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారని.. కానీ ‘గుడ్డి అనుచరులు దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘‘భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు.. మాకు అభివృద్ధి వద్దు..’’ అని అంటారన్నారు. కానీ పాఠశాలలు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు ఎందుకు శిథిలమవుతున్నాయని నిలదీశారు. దేశ వ్యాప్తంగా ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయని… ఈ గుడ్డి అనుచరులు ఎప్పటికీ ప్రశ్నించరన్నారు.