Reading Time: < 1 minute
Telangana Model School Armoor Perkit Recruitment Watchwoman Cook

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని పెర్కిట్ ఏరియాలో గల తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక నిరుద్యోగ మహిళలకు ఇది ఒక మంచి అవకాశమని పాఠశాల ప్రిన్సిపాల్ ఏవిఆర్.శ్యామ్, కేర్ టేకర్ కం వార్డెన్ ఎం.సునందలు ఒక ప్రకటనలో తెలిపారు.

నైట్ వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకు రూ. 8,710 వరకు ఉంటుంది. రాత్రి వేళల్లో పాఠశాల రక్షణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

అసిస్టెంట్ కుక్ పోస్టు విషయానికి వస్తే. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే.. 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. నెలకు రూ. 6,500 వరకు చెల్లిస్తారు. వంట పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ , ఇతర అవసరమైన పత్రాలతో నేరుగా పాఠశాల ఆవరణలో సంప్రదించవచ్చు. నిరుద్యోగులైన మహిళలు తమ ఇంటికి సమీపంలోనే ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోవద్దని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలన్నా లేదా దరఖాస్తు ఫారమ్ ల గురించి తెలుసుకోవాలన్నా అభ్యర్థులు నేరుగా పెర్కిట్ మోడల్ పాఠశాల కార్యాలయంలో పని దినాల్లో సంప్రదించవచ్చు.