Reading Time: 2 minutes

Peddi Release Official : టాక్సిక్ తప్పుకుంది.. పెద్ది వచ్చేస్తోంది.. జూన్ 4న గ్లోబల్ స్టార్ బాక్సాఫీస్ వేట!

Caption of Image.

ఎట్టకేలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.  ఇప్పటికే పలుమార్లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు.  లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ‘ పెద్ది’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన జూన్ 25న కాకుండా.. మూడు వారాల ముందే డేట్ ను ఖరారు చేసింది.  జూన్ 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

 పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్

హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో ఈ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖం నిండా రక్తంతో, అత్యంత తీవ్రమైన (Intense) చూపులతో ఉన్న రామ్ చరణ్ లుక్ చూస్తుంటే.. సినిమాలో ఎమోషన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు.

 

జూన్ 4 వెనుక అసలు వ్యూహం ఇదే!

యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో జూన్ 4వ తేదీ ఖాళీగా ఉంది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని చరణ్ అభిమానులు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిమాండ్ చేశారు. అభిమానుల కోరిక మేరకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా వేసవి సెలవులు అడ్వాంటేజ్ గా మారింది.  జూన్ మొదటి వారంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమన్న ధీమాలో మేకర్స్ ఉన్నారు.  ఆ సమయంలో పెద్ద చిత్రాల పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

భారీ తారాగణం.. 

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.  అటు శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు , సాయి కుమార్ వంటి ఉద్దండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ ‘రా’ అండ్ ‘రస్టిక్’ స్పోర్ట్స్ యాక్షన్ మూవీతో బుచ్చిబాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్, సినీ వర్గాలు ధీమాగా ఉన్నారు. మరి జూన్ 4న చరణ్ విశ్వరూపం ఏ మేరకు ఉంటుందో చూడాలి.
 

 

©️ VIL Media Pvt Ltd.