Reading Time: < 1 minute
Sharwanands Bhogi Anupama Parameswaran As Kandula Sulochana Rani First Look Release

టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోగి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా మాస్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండగా నారి నారి నడుమ మురారి, బైకర్ వంటి సినిమాలతో జోరుమీదున్న శర్వా భోగి సినిమా షూటింగ్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి మరో కీలకమైన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ‘కందుల సులోచన రాణి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది అనుపమ. పోస్టర్‌లో అనుపమ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండటంతో పాటు, రా అండ్ రస్టిక్ గా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. సంపత్ నంది తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కూడా చాలా బలంగా డిజైన్ చేస్తాడనే పేరుంది. అదే తరహాలో సులోచన రాణి పాత్ర కూడా ఉండబోతోన్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది హై బడ్జెట్ మూవీగా తెలుస్తోంది. సంపత్ నంది తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఈ సినిమాలో ప్లాన్ చేశారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.