Reading Time: < 1 minute
10th Class Results 2026 LIVE: పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..

తెలంగాణ పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ క్లాస్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ విద్యార్ధులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేసి ఒక్క క్లిక్‌తో మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి..

పదో తరగతి ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌ తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకోవచ్చు.. వాట్సాప్‌ ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు పంపితే.. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.