July 17, 2026

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..

Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
Reading Time: < 1 minute
Petrol Diesel Price Hike Centre Clarification No Increase

Petrol-Diesel Price: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్యానిక్ కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే, పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై కేంద్రం మంగళవారం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ ఆసియాలోని పరిణామాలపై జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, “పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు” అని స్పష్టతనిచ్చారు.

Read Also: Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజుల నుంచి పానిక్ కొనుగోళ్లు పెరగడంతో వీటిని అదుపు చేసే క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వదంతులు నమ్మవద్దని సుజాత శర్మ ప్రజల్ని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలను పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఖచ్చితంగా తోసిపుచ్చింది. ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపత్యంలో గత రెండు నెలల్లో ముడి చమురు ధర 50 శాతానికి పైగా పెరిగి, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై భారీ ఆర్థిక ఒత్తిడి పడుతున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది.