Reading Time: 2 minutes
Krishna : కృష్ణ కెరీర్ మలుపు తిప్పిన సినిమా.. థియేటర్ల వద్ద 144 సెక్షన్.. 40 ఏళ్లైనా తగ్గని డిమాండ్..

తెలుగు సినీరంగంలో ప్రయోగాలకు, సాహసానికి మారుపేరుగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 చిత్రంతో రికార్డ్స్ సృష్టించారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు.. ఫస్ట్ స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలను అందించిన ఘనత ఆయనకు తగ్గుతుంది. అలాగే తొలి తెలుగు 70MM 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి మీకు తెలుసా.. ? ఆ మూవీ కృష్ణ కెరీర్ మలుపు తిప్పింది. 1986 మార్చి 21న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు సింహాసనం. కథ విషయానికి వస్తే.. దశార్ణ రాజ్య సైన్యాధిపతి విక్రమసింహ (కృష్ణ) శక్తి సామర్థ్యాలను గుర్తించిన రాజు క్షేమేంద్ర భూపతి అతడికి భవానీ ఖడ్గాన్ని బహుమతిగా అందిస్తాడు. కానీ యువరాణి అలకనందాదేవి (జయప్రద) విక్రమసింహను ప్రేమిస్తుంది. కానీ తర్వాత ఆ రాజ్య మంత్రి భేరుండ శ్(ప్రభాకర్ రెడ్డి) కుట్రతో విక్రమసింహా రాజ్య బహిష్కరణకు గురవుతాడు. తర్వాత విక్రమసింహ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. ? తిరిగి రాజ్యంలోకి ఎలా అడుగుపెట్టాడు? అనేది సినిమా.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

దాదాపు 40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ వంటి కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది. అలాగే మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న మొదటి తెలుగు సినిమా ఇదే. అప్పట్లో ఈ సినిమాకు భారీ స్పందన రావడంతో థియేటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రద్దీ నియంత్రణ కోసం దారులు మళ్లించారు. ఇక విజయవాడలోని కొన్ని థియేటర్ల వద్ద 144 సెక్షన్ సైతం విధించాల్సి వచ్చింది. సినిమా టికెట్ ఉంటేనే వీధిలోకి అనుమతించే పరిస్థితి వచ్చిందంటే.. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సినిమా కోసం 144 సెక్షన్ అమలు చేయడం అదే మొదటిసారి.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..