
మీకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమా.. ? అయితే ఈరోజు మేము మీకు ఒక సినిమా గురించి చెప్పబోతున్నాము. ఇది పూర్తిగా హారర్ సినిమా కాకపోయినా, చూశాక మీకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఈ సినిమా పేరు వినగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ ఈ మూవీ కథ చాలా ఆకట్టుకునేలా, వాస్తవికంగా ఉంటుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా.. ? ఆ సినిమా పేరు ‘లవ్ ఔర్ ధోకా’ చిత్రం. దాని శీర్షిక కారణంగా భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో కేవలం అశ్లీలత లేదా వివాదాస్పద అంశాలు మాత్రమే ఉంటాయని చాలామంది భావించారు. కానీ వాస్తవానికి ఈ చిత్రం సమాజంలోని తీవ్రమైన, చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‌కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?
ఆ సమయంలో జరిగిన MMS కుంభకోణాలు, వేగంగా పెరుగుతున్న డిజిటల్ మీడియా ప్రభావం కారణంగా ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ఈ చిత్రం మూడు వేర్వేరు కథల ద్వారా డిజిటల్ సంబంధాలు, మోసం, నేరాల వాస్తవికతను చూపించింది. ఈ సినిమాను పూర్తిగా సీసీటీవీ, మొబైల్స్, రహస్య కెమెరాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇది ఆ కాలంలో ఒక విభిన్నమైన, ప్రయోగాత్మకమైన సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..
ఈ సినిమాను రూ.4.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. దాదాపు రూ.13 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రానికి IMDbలో 7.1 మంచి రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆద్యంతం కట్టిపడేసింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..
ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‌కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..