
అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా, ఈ ఉత్సవాల్లో ‘సూర్య తిలకం’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌లల్లా నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించి, అద్భుతమైన తిలకంగా మారాయి. దాదాపు 4 నిమిషాల పాటు ఈ దివ్యమైన దృశ్యం ఆవిష్కృతమవ్వడంతో గర్భగుడి మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. శ్రీరాముడు సూర్యవంశోద్భవుడు. అందుకే తన వంశకర్త అయిన సూర్యభగవానుడే స్వయంగా వచ్చి రామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తిలకం దిద్దినట్లుగా ఈ దృశ్యం కనిపించింది. ఈ అద్భుతం వెనుక భారతీయ శాస్త్రవేత్తల మేధస్సు దాగి ఉంది. ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యాధునిక అద్దాలు, కటకాల వ్యవస్థ ద్వారా సూర్యకిరణాలను ఆలయ పై అంతస్తు నుండి గర్భగుడిలోని విగ్రహంపైకి మళ్లించారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరమంతటా పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. శ్రీరామనవమి శుభవేళ బాలరాముడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. ముఖ్యంగా ఈ ఏడాది వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఈ సూర్య తిలకం వేడుక కేవలం ఆధ్యాత్మిక ఘట్టంగానే కాకుండా, భారత శాస్త్రవేత్తల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్
సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు