July 13, 2026

Band Melam Trailer: నా గుండెను పగలగొట్టినవ్‌.. ఇడ్సిపెట్టి పోవే: ఎమోషనల్గా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్‌

Band Melam Trailer: నా గుండెను పగలగొట్టినవ్‌.. ఇడ్సిపెట్టి పోవే: ఎమోషనల్గా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్‌
Reading Time: 2 minutes

Band Melam Trailer: నా గుండెను పగలగొట్టినవ్‌.. ఇడ్సిపెట్టి పోవే: ఎమోషనల్గా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్‌

Caption of Image.

‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి  జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band Melam). ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్’ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌ మూవీపై  ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలోనే  మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. 

మార్చి 26న రిలీజ్ అవుతోన్న ‘బ్యాండ్ మేళం’ ట్రైల‌ర్‌ బాగుంది. తెలంగాణ నేటివిటీతో పాటుగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్‌స్టోరితో మూవీ రానుంది. చిన్నప్పటి నుంచి బావ, మ‌ర‌ద‌ల్లా కలిసి పెరిగిన గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) మధ్య ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత చోటుచేసుకున్న అపార్థాలు, సంగీతం చుట్టూ తిరిగే కథాంశం ఆసక్తికరంగా ఉన్నాయి.

నేను నిన్ను మస్తు లవ్‌ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్‌.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. ఇలా మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు.

ఓవరాల్గా తెలంగాణ మాండలికంలో సాగే డైలాగులు యువతను కచ్చితంగా ఆకట్టుకుంటాయని ట్రైల‌ర్‌ చూస్తే అర్ధమవుతుంది. రోషన్ చేసే కామెడీ, రోషన్-శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ & ఎమోషనల్ సీన్స్, విజయ్ బుల్గానిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాకు ప్లస్ పాయింట్స్ అవ్వనున్నాయి. 

బాక్సాఫీస్ వద్ద అగ్నిపరీక్ష!

రోషన్, శ్రీదేవి జంట చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా, నటనలోనూ మంచి పరిణతి చూపిస్తున్నారు. ‘కోర్ట్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ జంట, ‘బ్యాండ్ మేళం’తో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవాలని కసితో ఉన్నారు. మార్చి 26న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

►ALSO READ | Rajamouli Dhurandhar 2 Review: ‘ధురంధర్‌ 2’పై రాజమౌళి టాప్ క్లాస్ ఎనాలిసిస్!

అంటే.. వేసవి సెలవుల ఆరంభంలో వస్తున్న ఈ పక్కా లోకల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ట్రైలర్ సృష్టించిన బజ్ చూస్తుంటే, థియేటర్లలో ‘బ్యాండ్ మేళం’ గట్టిగా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.