Reading Time: 2 minutes
Dhurandhar 2 Controversy Prakash Raj Reaction Tollywood Support

Prakash Raj: ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురందర్ ది రివెంజ్’ చిత్రం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ రచన, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రలలో నటించారు. వ్యూహకర్త అజయ్ సన్యాల్ పాత్రలో ఆర్ మాధవన్ తిరిగి రాగా, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్, ఎస్పీ చౌదరి అస్లాంగా సంజయ్ దత్ నటించారు. అటు కలెక్షనలో ఇటు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంలో ధురంధర్ సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ధురందర్: ది రివెంజ్’ చిత్రాన్ని టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ , మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా త అభిప్రాయాలను పంచుకున్నారు.

READ MORE: Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీ్ట్ వివాదానికి దారి తీసింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ, మిశ్రమ సమీక్షలను అందుకుంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని ప్రశంసించగా, ప్రకాష్ రాజ్ మాత్రం భిన్నమైన వైఖరిని వ్యక్తం చేశాడు. ఎక్స్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. “‘ధురంధర్‌ 2’ మూవీని అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌ బాబు వంటి స్టార్స్ అభినందించారు. కానీ బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా ట్వీట్ వేశారా?” అని ఓ నెటిజన్ ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించాడు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ ‘దక్షిణాదికి సైతం అబ్లికేషన్ అనేది వ్యాపించినట్టుగా ఉంది’ అని ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఎవరో చెప్పడం వల్లే టాలీవుడ్ ఇంతగా స్పందిస్తుందనే అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చాడు. తాను ధురంధర్-2కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. మీరు కూడా దూరంగా ఉంటారా? అని #justasking”లో నెటిజన్లను అడిగారు. మరోవైపు.. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ స్పందించడం లేదేమిటని ప్రశ్నిస్తున్నారు.

READ MORE: TATA Harrier EV: భారతీయ EV మార్కెట్‌లో కింగ్? టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ QWD 75 విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే