July 10, 2026

BAN vs PAK: పాకిస్తాన్ని ఘోరంగా ఓడించిన బంగ్లాదేశ్

BAN vs PAK: పాకిస్తాన్ని ఘోరంగా ఓడించిన బంగ్లాదేశ్
Reading Time: 2 minutes

BAN vs PAK: పాకిస్తాన్ని ఘోరంగా ఓడించిన బంగ్లాదేశ్

Caption of Image.

BAN vs PAK: టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉన్నట్లు నటించి, లాస్ట్ లో హ్యాండిచ్చిన పాకిస్తాన్ జట్టుకి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రపంచకప్ తర్వాత జరిగిన పాక్ క్రికెట్ జట్టు 3 వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో.. దాయాది దేశంపై 8 వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నహిద్ రాణా, ముస్తాఫిజుర్ రహ్మాన్ , తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ బౌలర్ల ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలిపోయింది. 

పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్. 22 ఏళ్ల పేసర్ నహిద్ రాణా నిప్పులు చెరిగేలా బంతులు విసరడంతో దాయాది బ్యాటర్లు విలవిలలాడి పోయారు. సొంత గడ్డపై వన్డేల్లో ఇస్లామాబాద్ పై ఓ ఢాకా బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (24 పరుగులకే 5 వికెట్లు).. ఇక పాక్ ఇన్నింగ్స్ లో 8 నంబర్ ప్లేయర్ ఫహీమ్ అప్రాఫ్ చేసిన 37 రన్స్ అత్యధికం అని చెప్పాలి. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ పోరులో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

►ALSO READ | Gautam Gambhir: కావాలనే గిల్ని తప్పించి సూర్యకు కెప్టెన్సీ..  గంభీర్– అగార్కర్ నిర్ణయం భేష్

ఇక ఫహీమ్, ఫర్హాన్ కాక మాజ్ సదాకత్ (18), మొహమ్మద్ రిజ్వాన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా పాక్ ఆటగాళ్లలో హమిల్ హుసేన్ 4, సల్మాన్ అఘా 5, హుసేన్ తలాత్ 4, షాహీన్ అఫ్రిది 4 పరుగులతో పాటు అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్ సున్నా రన్స్ కే అవుట్ అయ్యారు. అనంతరం 115 పరుగుల స్వల్ప టార్గెట్ కోసం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ (67 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ తో పాక్ ఇచ్చిన లక్ష్యాన్ని ఊదేశాడు. మరో ఓపెనర్ సైఫ్ హసన్ విఫలం (4 పరుగులు) కాగా, నజ్ముల్ హసన్ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత లిటన్ దాస్ (3 నాటౌట్) సహకారంతో మ్యాచ్ ని లాంఛనంగా ముగించేశాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్ లోని సెకండ్ వన్డే మార్చి 13న జరగనుంది.
 

©️ VIL Media Pvt Ltd.