July 10, 2026

గద్దర్ అవార్డులు కళాకారులకు అసలైన ప్రోత్సాహం.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నారాయణమూర్తి హర్షం!

గద్దర్ అవార్డులు కళాకారులకు అసలైన ప్రోత్సాహం.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నారాయణమూర్తి హర్షం!
Reading Time: < 1 minute

గద్దర్ అవార్డులు కళాకారులకు అసలైన ప్రోత్సాహం.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై నారాయణమూర్తి హర్షం!

Caption of Image.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గద్దర్ సినీ పురస్కారాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ పేరుతో పురస్కారాలు ప్రకటించిన ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాడు.  ఎన్నో సంవత్సరాల తర్వాత సినీ రంగానికి ప్రత్యేక గౌరవం దక్కేలా ఈ అవార్డులు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు..

గద్దర్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం తెలంగాణ సంస్కృతి, పోరాట చరిత్రకు గుర్తింపుగా నిలుస్తుందన్నారు నారాయణమూర్తి. విప్లవ గాయకుడు ప్రజల మనసుల్లో ఎప్పటికీ జీవించే వ్యక్తి. ఆయన పాటలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చాయని చెప్పారు. తెలంగాణ గడ్డపై ప్రతి ఇంట్లో గద్దర్ వంటి స్ఫూర్తిదాయక వ్యక్తులు ఉంటారని వ్యాఖ్యానించారు..  

అస్సాంలో ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు ఇచ్చిన గౌరవం ఎంత గొప్పదో, తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ కు అదే స్థాయి గౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.  గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కళాకారులకు మంచి ప్రోత్సాహంగా ఉంటుందని నారాయణమూర్తి అన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.