Reading Time: 2 minutes

LPG Shortage Effect: మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో LPG గ్యాస్ కొరత.. ఐపీఎల్ పై తీవ్ర ప్రభావం!

Caption of Image.

LPG Shortage Effect: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవైపు షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులు కళ్లకు కాయలు కాచేలా వేచి చూస్తుంటే, మరోవైపు దేశంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత, అసెంబ్లీ ఎన్నికలు బీసీసీఐకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. అయితే పశ్చిమ ఆసియాలో (ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా) జరుగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లో ముడి చమురు, ఎల్పీజీ  గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. గ్యాస్ కొరత దృష్ట్యా, గృహేతర అవసరాల కంటే గృహ అవసరాలకే అధిక ప్రాధాన్యతం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని హోటళ్లలో గ్యాస్ నిల్వలు కేవలం ఒకటి రెండు రోజులకు మాత్రమే సరిపడా ఉన్నాయని అసోసియేషన్లు తెలిపాయి.

గ్యాస్ కొరతపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాం.. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం.. కానీ పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా షెడ్యూల్ ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది అని వెల్లడించారు. ఈ క్యాష్ రీచ్ లీగ్ కి సంబంధించి మొదటి రెండు వారాల షెడ్యూల్‌ను మార్చి 12వ తేదీ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మిగత షెడ్యూల్ ని ఎన్నికల తేదీలు ఖారారు అయిన తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది. 

►ALSO READ | IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ కి శుభవార్త.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 

కాగా ఐపీఎల్ షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, పలు IPL ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ట్రైనింగ్ క్యాంప్‌లను ప్రారంభించాయి. ఆటగాళ్లు ఫిట్‌నెస్ అండ్ టీమ్ కాంబినేషన్లపై దృష్టి పెట్టాయి. దీంతో IPL 2026 షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారన్నదిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. ఇంగ్లాండ్ టీమ్ మార్చి 7వ తేదీనే స్వదేశానికి వెళ్లగా, విండీస్, దక్షిణాఫ్రికా టీమ్స్ ఆటగాళ్లు మాత్రం ఈరోజు (మార్చి 10న) బయలుదేరే అవకాశం ఉంది. ఐసీసీ కేవలం ఇంగ్లాండ్‌కే ప్రాధాన్యత ఇస్తోందని ఇతర జట్ల ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. 

©️ VIL Media Pvt Ltd.