Reading Time: 2 minutes
Sesame Laddu For Anemia Health Benefits Of Eating Nuvvula Laddu Daily

Sesame Laddu: ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల నీరసం, అలసట, త్వరగా శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ పదార్థాలతోనే ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది ‘నువ్వుల లడ్డూ’. దీనిని ప్రతిరోజూ తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నువ్వుల లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు:
నువ్వుల లడ్డూ తయారు చేయడానికి చాలా తక్కువ పదార్థాలే సరిపోతాయి. ఒక కప్పు నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు తీసుకోవాలి. అయితే ఆరోగ్యానికి నల్ల నువ్వులు మరింత మంచివిగా భావిస్తారు. ఇంకా ముప్పావు కప్పు బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అవసరం అవుతుంది. ఈ పదార్థాలతో చాలా సులభంగా లడ్డూలను తయారు చేయవచ్చు.

Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

తయారీ విధానం:
మొదట స్టవ్‌పై ఒక పాన్ పెట్టి నువ్వులను చిన్న మంటపై దోరగా వేయించాలి. అవి చిటపటలాడే వరకు వేయించి, మాడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నువ్వులను మిక్సీ జార్‌లో వేసి కొంచెం ముద్దగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అదే జార్‌లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చేతులతో చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

నువ్వుల లడ్డూ ప్రయోజనాలు:
నువ్వులు, బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే ఇందులో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఒక నువ్వుల లడ్డూ తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అదనంగా నువ్వుల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

కాబట్టి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక నువ్వుల లడ్డూను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో రక్తహీనత సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు.