July 9, 2026

Thalapathy Vijay: విడాకుల వివాదంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్.. నా సమస్యలు నేను చూసుకుంటా.. కంగారు పడకండి!

Thalapathy Vijay: విడాకుల వివాదంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్.. నా సమస్యలు నేను చూసుకుంటా.. కంగారు పడకండి!
Reading Time: 2 minutes

Thalapathy Vijay: విడాకుల వివాదంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్.. నా సమస్యలు నేను చూసుకుంటా.. కంగారు పడకండి!

Caption of Image.

తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేత విజయ్ ను వరుస వివాదాలు చుట్టు ముట్టాయి. సినిమాలకు గుడ్ బై చెప్పి .. రాజకీయాలపై దృష్టిపెట్టిన ఆయనకు ప్రత్యర్థుల నుంచే కాదు .. సొంత ఇంటి నుంచే ఇప్పుడు ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఒక వైపు రాజకీయాలు, మరో వైపు విడాకుల వివాదంతో నలిగిపోతున్నారు . ఇది అభిమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన విడాకుల వివాదంపై విజయ్ స్పందించారు. అభిమానులకు ధైర్యం చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

నా సమస్యలు నేను చూసుకుంటా…

చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ తన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై తొలిసారిగా పరోక్షంగా స్పందించారు. విడాకుల వ్యవహారం,త్రిషతో ముడిపెడుతూ వస్తున్న రూమర్లపై విజయ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “నా జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మీరు ఆందోళన చెందకండి. ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కోసం మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింత బాధపెడుతోంది. వ్యక్తిగత వివాదాల సంగతి నేను చూసుకుంటాను, మీరంతా కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంగీత కొత్త పిటిషన్

మరోవైపు విజయ్ భార్య సంగీత కోర్టులో తాజాగా మరో అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. విడాకుల కేసు తేలే వరకు చెన్నై నీలంగరైలోని విజయ్ ఇంట్లోనే తనకు ఉండే హక్కు కల్పించాలని ఆమె కోరారు. తన భర్త లాయర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు వేరే నివాసం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిబ్రవరి 24న వేసిన విడాకుల పిటిషన్‌లో విజయ్ ద్రోహం చేశారని ఆరోపించిన ఆమె, రూ. 250 కోట్ల భారీ భరణం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది.

మహిళల కోసం సూపర్ సిక్స్ పథకాలు

రాజకీయంగా తన పట్టు నిరూపించుకునేందుకు విజయ్ మహిళా దినోత్సవం రోజే తన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించారు. మహిళా కుటుంబ యజమానులకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం. అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం. అన్నన్ సీర్ పథకం పేరుతో పేద ఆడపిల్లల పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం, పట్టు వస్త్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక ‘రాణి వేలునాచియర్’ దళం ఏర్పాటు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రకటించారు.

 

©️ VIL Media Pvt Ltd.