Reading Time: < 1 minute

వరంగల్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలు అంటుకుని కాలిపోతున్న షాపులు

Caption of Image.

వరంగల్: వరంగల్ సిటీలో శనివారం (మార్చి 7, 2026) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని షాపులు కాలిపోతున్నాయి. వరంగల్ జే బీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపు మంటల్లో దగ్ధమైంది. పక్కన ఉన్న షాపులకు కూడా మంటలు అంటుకుని కాలిపోతుండటంతో ప్రజలు, షాపు యజమానులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మంటలు అర్పి వేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. 

ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన ఫర్నిచర్ షాపు పూర్తిగా దగ్ధమైంది. షాపులో ఫర్నిచర్ దాదాపుగా ఏం మిగల్లేదు. కళ్ల ముందు ఫర్నిచర్ షాపు కాలిపోతున్న తీరు చూసి యజమాని రోదించారు.

©️ VIL Media Pvt Ltd.