
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్యథర్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్2’. మార్చి 19న మూవీ విడుదలకు సిద్ధమైంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘ధురంధర్’ గతేడాది విడుదలై, ఎంతటి సంచలనం సృష్టించిందో.. అంతకు రెట్టింపు పంజా విసురుతూ పార్ట్ 2 ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.
ఈ సీక్వెల్‌పై ఇండియన్ సినీ పేక్షకుల్లోనే కాదు వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ ఉండటంతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని సినీ వర్గాలు అంటున్నాయి.
‘ధురంధర్’ పార్ట్ 1: 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ‘ధురంధర్’.. బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది. ఆదిత్యధర్ అద్భుతమైన మేకింగ్, రణవీర్ సింగ్ ఎనర్జీ తోడవ్వడంతో ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్, ఇండియాలోరూ.836 కోట్ల నెట్ వసూలు చేసి 2025లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే “ధురంధర్” పార్ట్ 2 అనౌన్స్ మెంట్ వచ్చింది.