Reading Time: 2 minutes
Ind Vs Wi Super 8 Eden Gardens Record Favors India But Bowling Concerns Ahead Of Crucial Clash

India Have Bowling Issue Ahead of IND vs WI Super 8 Match: టీ20 ప్రపంచకప్‌ 2026లో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. గ్రూప్‌-1 సూపర్‌ 8 మ్యాచ్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్‌ నేడు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీ ఫైనల్‌కు చేరుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోతుంది. భారత్, వెస్టిండీస్‌ జట్ల బ్యాటింగ్ బలంగా ఉండడంతో ఈ పోరు చాలా ఆసక్తి కలిగిస్తోంది. క్వార్టర్‌ ఫైనల్‌ లాంటి ఈ సూపర్‌ 8 మ్యాచ్‌లో ఏ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి. ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియాకు మంచి రికార్డు ఉన్నా.. ఓ సమస్య మాత్రం సూర్య సేనను వేధిస్తోంది.

1983 నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు ఉంది. ఇప్పటివరకు ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ టీమిండియాను వెస్టిండీస్‌ ఓడించలేదు. ఈడెన్‌లో విండీస్‌తో ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈరోజు భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇటలీపై స్కాట్లాండ్‌ 207 పరుగులు చేసింది. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న విండీస్‌ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాకు బౌలింగ్‌ ఇంకా సమస్యగానే ఉంది. బుమ్రా, అర్షదీప్ మినహా అందరూ భారీగా రన్స్ ఇస్తున్నారు. సూపర్‌ 8 మ్యాచ్‌లలో హార్దిక్, వరుణ్, అక్షర్, దూబే ఎక్కవగా రన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బంతితో పుంజుకోవడం టీమిండియాకు చాలా ముఖ్యం.

Also Read: Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!

బ్రెండన్‌ కింగ్, షై హోప్, షిమ్రాన్ హెట్‌మయర్ టాపార్డర్‌లో రెచ్చిపోతున్నారు. హెట్‌మయర్‌ మూడో స్థానంలో ఆడడం కూడా వెస్టిండీస్‌కు సత్ఫలితాలనిస్తోంది. రోమన్‌ పావెల్, రోస్టన్ చేజ్, రూథర్‌ఫర్డ్ మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాపై 9వ స్థానంలో వచ్చిన షెపర్డ్‌ అర్ధ శతకం చేశాడంటే.. విండీస్ బ్యాటింగ్ లోతు ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. విండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే.. టీమిండియా బౌలర్లు శ్రమించాల్సిందే. స్పిన్నట్లు తేలిపోతున్న వేళ.. పేసర్లు బుమ్రా, అర్షదీప్ ఎలా రాణిస్తారో చూడాలి.