Reading Time: < 1 minute
Lover Killed For Refusing Marriage Stabbed To Death

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించింది అనే కారణంతో ప్రియురాలిని ఇంటి కెళ్లి మరీ కత్తితో దాడి చేసి హత్య చేసిన యువకుడు, అడ్డుగా వచ్చిన ఆమె నానమ్మపై కూడా అతి కిరాతకంగా దాడి చేసి పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన పొల్లాచ్చి సమీపంలో జరిగింది.

Read Also: Oil Free Mutton Paneer: ఆయిల్ లేకుండానే అదిరిపోయే మటన్ పన్నీర్.. ఒక్కసారి తిన్నారంటే!

అయితే, పొల్లాచ్చి సమీపంలోని గౌండన్‌పాళయం గ్రామానికి చెందిన భూపతి కుమార్తె కౌశీతో, అభిషేక్‌కు కొంతకాలంగా ప్రేమ వ్వవహారం కొనసాగింది. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు నిరాకరించడంతో అభిషేక్ ఉన్మాదిగా మారినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో యువకుడు కౌశీ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయగ, ఆమె నిరాకరించడంతో కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు అభిషేక్. ఈ ఘటనతో కౌశీ అక్కడికక్కడే మృతి చెందగా, అడ్డువచ్చిన ఆమె నాన్నమ్మ చికిత్స పొందుతు మరణించింది.

Read Also: Salman Ali Agha Wife: “అలా చేస్తే పాక్ టీ20 వరల్డ్ కప్ గెలవదు”.. పాకిస్థాన్ కెప్టెన్ భార్య ఎమోషనల్ పోస్ట్

ఇక, కౌశీని రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె అక్క హరితపై కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హరితను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారీ కాగా, అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.