Reading Time: < 1 minute
The Wedding Of Virosh Vijay Deverakonda And Rashmika Mandanna Marry In Udaipur

టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. ఈ ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

Also Read : Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?

ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ (ViRo-shi) అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) ప్రాంతానికి చెందిన వారు. తమ ప్రాంత సంప్రదాయానికి గౌరవం ఇస్తూ.. ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ జంట మరోసారి ‘కొడవ’ పద్ధతిలో వివాహం చేసుకోబోతున్నారు. సాధారణంగా కొడవ పెళ్లిళ్లు చాలా ప్రత్యేకంగా, విభిన్నమైన వస్త్రధారణతో సాగుతాయి. ఒకే రోజు రెండు వేర్వేరు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం విశేషం. విజయ్, రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.