Reading Time: < 1 minute
Motn Survey August 2026 Nda 326 India Bloc 185

MOTN Survey 2026: తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది. గత సర్వేతో పోలిస్తే ఎన్డీయే బలంలో కొంత తగ్గుదల కనిపించింది. తాజా అంచనాల ప్రకారం.. నేడే లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది.

అయితే, ఎన్డీయే మద్దతు కొంత మేర క్షీణిస్తుందని సర్వే అంచాన వేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సీట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. తాజా సర్వేలో ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. జనవరి 2026 MOTN సర్వేలో ఈ సంఖ్య 182గా ఉంది. ఓట్ షేర్ ప్రకారం చూస్తే బీజేపీకి 39 శాతం, కాంగ్రెస్‌కు 21 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య 25,184 మంది నుంచి ప్రత్యక్షంగా అభిప్రాయాలను సేకరించారు.