Reading Time: < 1 minute

సర్ పై నిర్లక్ష్యం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహశీల్దార్ సస్పెన్షన్

Caption of Image.

జగిత్యాల జిల్లాలో అధికార యంత్రాంగంపై కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మెట్‌పల్లి తహశీల్దార్ నీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి అలాగే ప్రత్యేక ఓటర్ సవరణ (SIR) పనుల పురోగతిలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించిన కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. పనుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.

ఈ క్రమంలోనే సస్పెన్షన్‌కు గురైన తహశీల్దార్ నీత స్థానంలో, కొత్త తహశీల్దార్‌గా ముఫ్తార్ పాషాను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆయన మెట్‌పల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. భూ భారతి , ఓటర్ సవరణ పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, అధికారులు అందరూ బాధ్యతగా పనిచేయాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ హెచ్చరించారు.

ALSO READ : నేపాల్‌ వరదల నుంచి తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు

©️ VIL Media Pvt Ltd.