
న్యూయార్క్: సౌదీపై యెమెన్ హౌతీలు కొనసాగిస్తున్న దాడులను వెంటనే నిలిపేయాలని జీ7 దేశాలు డిమాండ్ చేశాయి. న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో పాల్గొన్న బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులు ఈమేరకు ప్రకటన చేశారు. హౌతీలు అన్ని సైనిక చర్యలను, పౌర నౌకలపై బెదిరింపులు, దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. హౌతీలకు ఆయుధాలు అందించవద్దని ఇరాన్‌కు సూచించారు. హౌతీలకు ఇరాన్ మద్దతు అంతర్జాతీయ వ్యాపారానికి ఇబ్బందులు కలిగించడంతోపాటు ప్రపంచ అస్థిరతకు దారితీసే పరిస్థితి కల్పిస్తోందని పేర్కొన్నారు.