Reading Time: 2 minutes
JPN vs IND: టీమిండియా తొండి చేసి గెలిచిందా.. అసలు ఆ నిర్ణయంపై ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

India vs Japan T20I Umpire Controversy: సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Sano International Cricket Stadium) వేదికగా జరిగిన వర్షం ప్రభావిత 5 ఓవర్ల మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు (Team India) అతికష్టం మీద విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని జట్టు నెమ్మదైన పిచ్‌పై పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడింది. నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య చేధనలో కెండెల్ కడోవకి-ప్లెమింగ్ సారథ్యంలోని జపాన్ జట్టు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. చివరి ఓవర్లో గెలవడానికి 8 పరుగులు అవసరమవ్వడంతో భారత్‌కు ఓటమి ముప్పు పొంచివుంది.

ఈ ఉత్కంఠభరిత తరుణంలో అక్షర్ పటేల్ (Axar Patel) ఒత్తిడిని జయించి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ క్రిస్ థర్గెట్ (Chris Thurgate) ఇచ్చిన ఒక వివాదాస్పద నిర్ణయం పెద్ద దుమారమే రేపింది. అక్షర్ వేసిన ఓవర్లో ఎడమచేతి వాటం బ్యాటర్ అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్ (Alexander Shirai-Patmore) రివర్స్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అంపైర్ వైడ్ సంకేతం ఇచ్చాడు. దీనిని చూసి భారత ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. అక్షర్ అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలోనే అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎక్కువమంది చదివనది: Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

వెంటనే ఐసీసీ (ICC) ఎలైట్ ప్యానెల్ సభ్యుడు లెగ్ అంపైర్ క్రిస్ బ్రౌన్ (Chris Brown) జోక్యం చేసుకున్నాడు. సహచర అంఫైర్‌కు సరైన సలహా అందించడంతో థర్గెట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం బ్యాటర్ రివర్స్ లేదా స్విచ్ హిట్ ఆడే యత్నం చేసినప్పుడు వికెట్ రెండు వైపులా ఆఫ్‌ సైడ్‌గానే పరిగణిస్తారు. వైడ్ కావాలంటే బంతి ఆటోమేటిక్‌గా డెలివరీ అదనంగా దూరంగా వెళ్లాలి. బ్యాటర్ తన స్టాన్స్‌ను మార్చినా ఈ నిబంధనే వర్తిస్తుంది. గత దశాబ్ద కాలంగా ఇలాంటి బంతులను వైడ్‌గా పరిగణించడం లేదు.

ఎక్కువమంది చదివనది: 5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర!

ఈ నిర్ణయంతో సమీకరణం మారిపోయింది. చివరికి జపాన్ జట్టు 3 వికెట్లకు 30 పరుగులు చేసి కేవలం 2 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అక్షర్ చివరి ఓవర్లో ఒత్తిడిని తట్టుకుని జట్టును గెలిపించినప్పటికీ అంపైర్ నిర్ణయం మ్యాచ్‌ను ఎక్కువసేపు వార్తల్లో నిలిచేలా చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..