Reading Time: 3 minutes
జూలై 31 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ధన యోగం ఖాయం.. మీ రాశికి ఎలా ఉంటుందంటే..?

దిన ఫలాలు (జూలై 31, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశికి చెందిన ఉద్యోగుల శక్తి సామర్థ్యాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త అవకాశాలు లభిస్తాయి. రాబడి పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. బంధుమిత్రులతో ఒకటి రెండు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగుల శక్తి సామర్థ్యాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దైవకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతా వరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. పెండింగ్ పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు వసూల వుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవు తుంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ధన యోగం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెడతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త వస్తు వాహన లాభాలు పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆధ్యా త్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రు లతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు కొద్దిగా తగ్గుతాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: మాసఫలాలు (ఆగస్టు 2026): ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది.. అదృష్ట రాశులివే..

గమనిక: ఈ రాశి ఫలితాలు వేద జ్యోతిష్య సిద్ధాంతాలు, గ్రహ గోచారాలు, సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, గోచారాలు, ఇతర అంశాల ఆధారంగా ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు. ఈ వివరాలను ఖచ్చితమైన ఫలితాలుగా లేదా హామీగా పరిగణించరాదు. వ్యక్తిగత జాతక విశ్లేషణ, నిర్ణయాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది.