Reading Time: < 1 minute

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Caption of Image.

 యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బుధవారం (జులై 29) లోక్ సభలో ఆమోదం లభించడంతో.. గురువారం (జులై 30) రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. తీవ్ర గందరగోళ వాతావరణం మధ్య విపక్షాలు వాకౌట్ చేయగా.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026ను ఆమోదించారు.  

పేపర్ లీక్స్ పాల్పడే వారిపై కఠిణమైన చర్యలు తీసుకునే  చట్టం చేయాలనే ఉద్దేశంలో తీసుకొచ్చిన  బిల్లు ఇది.  

ఈ బిల్లు ప్రకారం,    ప్రశ్నపత్రాల లీకేజీ లేదా అక్రమ పద్ధతులకు పాల్పడే వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాకుండా బిల్లు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానాను నిర్దేశిస్తుందని అధికులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.