Reading Time: < 1 minute

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

Caption of Image.

ఆషాఢ  బోనాల జాతర పురస్కరించుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో గురు (జులై 30) బంగారు బోనం సమర్పించారు. జోగిని అవిక బంగారు బోనము ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. 

గత 17 సంవత్సరాలుగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనము సమర్పిస్తున్నామని అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ వెల్లడించారు. అమ్మవారి దయతో తెలంగాణ ప్రజలు తోపాటు దేశంలోని ప్రజలంతా సుఖశాంతులతో పాడిపంటలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. 

►ALSO READ | శ్రీశైలం భక్తులకు గమనిక.. స్పర్శ దర్శనం, సేవా టికెట్ల జారీలో మార్పులు

నగరంలోని తొలిసారిగా గోల్కొండ అమ్మవారికి బోనము సమర్పించడం జరిగిందని, ప్రముఖ దేవాలయాలకు  బంగారు బోనము సమర్పిస్తామని ఆయన తెలిపారు. డోలు చెప్పాల మధ్య జోగిని అవిక చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుుంది. దేవాలయంలో ఒక్కసారిగా బోనాల సందడి నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.