Reading Time: 2 minutes
Gundu Hanumanth Rao : హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. అతడి సినిమాల సెలక్షన్ సూపర్ ఉంటుంది.. టాలీవుడ్ నటుడు..

గుండు హనుమంతరావు.. తెలుగు సినిమా హాస్య చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయం. ఆయన తనదైన శైలిలో, సున్నితమైన హాస్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ సంచలనం అమృతం సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇందులో తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికీ అమృతం ఆంజనేయులు పాత్రతోనే గుర్తుపెట్టుకున్నారు. దశాబ్దాల పాటు సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించిన ఆయన 2018లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇదిలా ఉంటే.. తన హాస్యంతో ఎంతో మందిని అలరించిన ఆయన, ఒక ఇంటర్వ్యూలో నాచురల్ స్టార్ నాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

ప్రస్తుత తరం హీరోల్లో ఆయనకు నాని నటన అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. నాని సినిమాల్లో ఆయన నటన ఎంతో సహజంగా ఉంటుందని గుండు హనుమంతరావు తెలిపారు. ముఖ్యంగా నానిని చూస్తే మన పక్కింటి అబ్బాయిలానో లేదా మన ఇంట్లోని వ్యక్తిలానో అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ సహజత్వమే నానిని నేటి ప్రేక్షకులకు దగ్గర చేసిందని ఆయన అన్నారు. నాని ఎంచుకునే కథల్లోనూ వైవిధ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం కమర్షియల్ హంగులకే ప్రాధాన్యం ఇవ్వకుండా, కంటెంట్ ఉన్న కథలను నాని ఎంచుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘నిన్ను కోరి’ వంటి సినిమాల ఎంపిక.. అందులో నాని నటన బాగుంటుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఒక సినిమా థియేటర్‌కు వెళ్ళినప్పుడు ప్రేక్షకుడికి కావలసింది వినోదం , ప్రశాంతత. నాని సినిమాలు ఆ రెండింటిని అందిస్తాయని గుండు హనుమంతరావు అన్నారు. పాటలు, మాటలు, నటన పరంగా నాని సినిమాలు ఎంతో ‘ప్లెజెంట్’గా ఉంటాయని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Nani

Nani

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..