Reading Time: < 1 minute
Gayatri Gupta Savage Reply To Shivaji Over Saree Dressing Comments

టాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీపై విరుచుకుపడ్డారు. మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీకి ఉన్న అభిప్రాయాలను తప్పుబడుతూ ఆమె చేసిన ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక సందర్భంలో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే బాగుంటుందని, వెస్ట్రన్ డ్రెస్సుల కంటే అదే గౌరవప్రదమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన గాయత్రి గుప్తా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

నా ఇష్టం..‘నేను చీర కట్టుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. ఎవరో శివాజీ గారు అన్నారని నేను చీర కట్టుకోను. నాకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకుంటాను. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. అలా ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు’ అంటూ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత విషయం, ఆమె అన్నదానిలో తప్పేముంది?’ అని కొందరు గాయత్రిని సమర్థిస్తుంటే.. ‘శివాజీ గారు పెద్దవాడు, ఆయన ఒక సలహా ఇచ్చారు. దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా?’ అని శివాజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మొత్తనికి మరో సారి శివాజి మాటలు వైరల్ అవుతున్నాయి.