Reading Time: < 1 minute
PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవానం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లగా తర్వాత వచ్చిన బ్యాటర్స్ సైతం దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ స్కోర్‌ బోర్డును మరింత వేగంతో పెంచేశాడు. స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 62 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఒపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ 27 బంతుల్లోనే 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను చుక్కలు చూపించాడు వైభవ్ సూర్యవంశీ. కానీ అర్షదీప్ వేసిన బంతిని షార్ట్ ఆడేందుకు ప్రయత్నించి శ్రేయాష్‌కు క్యాచ్ ఇచ్చి వైబర్ వెను తిరిగాడు.

తర్వాత చాహల్ తన స్పిన్ మాయాతో మూడు వికెట్లు పగడొట్టినా తర్వాత వచ్చిన డొనోవన్ ఫెరీరా 52 పరుగులతో చెలరేగాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే సైతం 31 పరుగులతో అద్భుత పోరాటం చేశారు. వీరిద్దరూ కలిసి కేవలం 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి రాజస్థాన్‌కు విజయాన్ని అందించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.