Reading Time: < 1 minute
Ipl 2026 Pbks Vs Rr Match 40 Live Toss Update Playing Xi News

PBKS vs RR: ఐపీఎల్ 19వ సీజన్‌లో నేడు పంజాబ్ కింగ్స్ (PBKS) – రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగుతుంది. పంజాబ్ కింగ్స్ బలాల విషయానికి వస్తే ఈ సీజన్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే.. రాజస్థాన్ జట్టు తన మునుపటి లయను అందుకోవాలని చూస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ కీలకం కానున్నారు.

తుది జట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.

పంజాబ్ కింగ్స్: ప్రభసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, సూర్యాన్ష్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లూకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.