Reading Time: < 1 minute
Royal Challengers Bengaluru Won Toss And Opted To Field First

ఐపీఎల్ 2026 లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి, మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ప్రస్తుతం ఆర్‌సీబీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో మంచి స్థితిలో ఉంది. కానీ గుజరాత్‌పై గెలిస్తే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ విషయానికొస్తే, ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి గుజరాత్‌కు విజయం అవసరం. రెండు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. అయితే, గుజరాత్ కంటే ఆర్‌సిబి బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్