
RCB VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఉత్కంఠ పోరు జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. చిన్నస్వామి పిచ్‌పై ఛేజింగ్ చేయడం సులభం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోగా.. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగబోతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఈ పిచ్ కండిషన్స్, చిన్నస్వామి స్టేడియం హిస్టరీని దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ తీసుకున్నాం.. ఆరంభంలోనే వికెట్లు తీసి గుజరాత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే మా లక్ష్యం.. ఈ మ్యాచులో ఒక మార్పు చేశాం.. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా ఈ పోరుకి దూరమయ్యాడు.. అతని స్థానంలో జాకబ్ బెథెల్ ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడుబోతున్నాడని పాటిదార్ వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా ఛేజింగ్ ఎంచుకునేవాళ్లం.. కానీ మొదట బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే.. గత మ్యాచ్ (ముంబైతో) ఓటమిని మర్చిపోయి, ఈరోజు మంచి పునాది వేసి భారీ స్కోరు సాధించాలని భావిస్తున్నాం.. గుజరాత్ జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి.. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ గుజరాత్ తరపున అరంగేట్రం చేస్తుండగా, మానవ్ సుతార్ మళ్ళీ తుది జట్టులోకి వచ్చాడని గిల్ పేర్కొన్నాడు.
►ALSO READ | 103 రన్స్ తేడాతో CSK చేతిలో ఘోర ఓటమి.. ముంబై ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే ఇలా జరగాల్సిందే?
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @gujarat_titans in Bengaluru
Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT pic.twitter.com/Rbn3cx4DRm
— IndianPremierLeague (@IPL) April 24, 2026