
పోస్టల్ శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. సరైన అవకాశం ఎదరుచూస్తున్న వారికి తపాలా శాఖ ఆఫర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. పోస్టల్ శాఖ ఫ్రాంచైజీ అవుట్ లెట్లు స్థాపించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ 2026 ఏప్రిల్ 24న ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్‌లో పోస్టల్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు స్థాపించడానికి దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. సికింద్రాబాద్ డివిజన్ ప్రజలకు తపాలా సేవలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోస్టల్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు స్థాపించడానికి ఆసక్తి గల వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ అవకాశం సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల నివాసులకు అందుబాటులో ఉంది.
అర్హతా నిబంధనలు:
- వృత్తి:
ప్రత్యేక మార్కెట్లు (ఎలక్ట్రానిక్, చేతివృత్తుల మార్కెట్లు మొదలైనవి) నడిపే వ్యక్తులు, చిన్న వ్యాపారస్తులు, కిరాణా దుకాణదారులు, స్టేషనరీ దుకాణదారులు, పాన్ షాపు యజమానులు , స్వంత వ్యాపారం చేసుకునే వ్యక్తులు అర్హులు.
- వయసు:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
- విద్యార్హత:
గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి.
డెలివరీ సేవలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది
- సాంకేతిక పరిజ్ఞానం:
కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన, శాఖాపరమైన మొబైల్ అప్లికేషన్లు నిర్వహించగల సామర్థ్యం ఉండాలి.
(కంప్యూటర్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు.)
- భాషా నైపుణ్యం:
స్థానిక భాష, ఇంగ్లీషులో మాట్లాడటం, రాయగలిగే సామర్థ్యం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ (డెలివరీ సేవలకు):
చెల్లుబాటు అయ్యే 2/4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, స్వంత వాహనం కలిగి ఉండాలి.
- ఇతర అవసరాలు:
దరఖాస్తుదారు తప్పనిసరిగా పాన్ కార్డు కలిగి ఉండాలి.
✅ ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత నిబంధనల ప్రకారం భద్రతా డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
✅ ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం సమీప పోస్ట్ ఆఫీస్ లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.