Reading Time: < 1 minute
Hmd Vibe2 Pro 5g Price Specs Sale

ఎచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో హెచ్‌ఎండీ వైబ్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.14,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. సిల్వర్ మిస్ట్, అక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ కలర్స్‌లో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అక్టోబర్ 8, 2026 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనికి రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి. పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందించారు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 (ఆఫర్ ధర) కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా వెనుక వైపు 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 682 ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో సర్వమ్ ఏఐకి చెందిన ఇండస్ ఏఐ అసిస్టెంట్ ఇచ్చారు. ఇది 22కంటే ఎక్కువ భారతీయ భాషల్లో పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుపరిచారు. ఇంకా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.