Reading Time: 2 minutes

హిందూ సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఉండే ప్రాముఖ్యతే వేరు. అయితే 2026 సంవత్సరంలో ఈ పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. మార్చి 26నా లేక 27నా అనే సందేహాలకు పండితులు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు. తిథి, నక్షత్ర బలాలు మరియు సూర్యోదయ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని పండుగను ఎప్పుడు జరుపుకోవాలో స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం..

పండుగ తేదీపై ఎందుకు గందరగోళం?: సాధారణంగా ఉగాది తర్వాత తొమ్మిదో రోజున వచ్చే నవమి తిథి నాడు మనం శ్రీరామ నవమి జరుపుకుంటాం. అయితే ఈసారి నవమి తిథి మార్చి 26, 27 రెండు రోజుల్లోనూ వచ్చింది. దీంతో భక్తుల్లో ఏ రోజు సీతారాముల కళ్యాణం నిర్వహించాలి, ఏ రోజు ఉపవాసం ఉండాలి అనే అయోమయం మొదలైంది.ఇక ఊరూరా ఘనంగా జరిగే ఈ వేడుకల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పండితులు చెబుతున్న లెక్కలివే: హిందూ పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26వ తేదీ గురువారం మధ్యాహ్నం ప్రారంభమై, మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మార్చి 27 సాయంత్రం వరకు ఉంది. ఇక మన శాస్త్రాల ప్రకారం, ఏ పండుగ అయినా సూర్యోదయ సమయంలో ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే మార్చి 27వ తేదీని అసలైన పండుగ రోజుగా నిర్ణయించారు.

2026 Rama Navami: Panchang Timings & Celebration Facts
2026 Rama Navami: Panchang Timings & Celebration Facts2026 Rama Navami: Panchang Timings & Celebration Facts

అభిజిత్ లగ్నం.. కళ్యాణ గడియలు: శ్రీరామ చంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు, అభిజిత్ లగ్నంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ లెక్కన మార్చి 27, శుక్రవారం రోజున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం అత్యంత శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. భద్రాచలంలో కూడా ఇదే సమయానికి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

ఇలా ప్లాన్ చేసుకోండి: మీరు ఇంట్లో పూజ చేసుకోవాలన్నా లేదా రామాలయానికి వెళ్లి కళ్యాణం చూడాలనుకున్నా మార్చి 27వ తేదీని ఫిక్స్ చేసుకోండి. ఇక ఆ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, రామయ్యకు ఇష్టమైన పానకం, వడపప్పు నివేదన చేస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సూర్యోదయ తిథి ప్రాధాన్యత వల్లే శుక్రవారం రోజే పండుగ శోభ సంతరించుకోనుంది.

భక్తుల గందరగోళాన్ని తొలగిస్తూ పండితులు ఇచ్చిన ఈ స్పష్టతతో అందరూ మార్చి 27న భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. పానకం, వడపప్పుల నైవేద్యంతో, జై శ్రీరామ్ నామస్మరణతో ఆ రోజంతా ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. అందరికీ ముందస్తు శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

గమనిక: పైన పేర్కొన్న వివరాలు పంచాంగ కర్తలు మరియు జ్యోతిష్య పండితులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇవ్వబడినవి. ప్రాంతీయ భేదాలను బట్టి మీ స్థానిక ఆలయ పండితులను సంప్రదించడం ఉత్తమం.

The post పంచాంగం ప్రకారం శ్రీరామనవమి ఎప్పుడంటే?.. పూర్తి వివరాలు appeared first on Manalokam – Latest Telugu News & Updates.