
టాలీవుడ్ యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఇటీవల బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కబోతోందన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సంగీత దర్శకుడు కాల భైరవ , ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత క్లారిటీ వచ్చింది.
ఒక్క వీడియోతో మారిన సీన్!
కాలభైరవ, కావ్య ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కాల భైరవ, కావ్య పక్కపక్కనే కూర్చుని ఎంతో క్లోజ్‌గా ముచ్చటించుకుంటూ కనిపించారు. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఈ జంట ఇలా బహిరంగంగా జంటగా కనిపిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
వారసత్వం నుంచి సొంత గుర్తింపుతో..
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబానికి చెందిన కాల భైరవ, తన తండ్రి కీరవాణి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘RRR’ సినిమాలోని “కొమురం భీముడో” పాటకు గాను ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. కేవలం సింగర్‌గానే కాకుండా ‘మత్తు వదలరా 2’, ‘యూఫోరియా’, ‘మౌగ్లీ’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.
నటిగా కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘టాగూర్’, ‘బాలు’, ‘బన్నీ’, ‘విజయేంద్ర వర్మ’ వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్‌గా మారిన తర్వాత ‘మసూద’, ‘బలగం’ చిత్రాలతో తన సహజ సిద్ధమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక విశేషం ఏంటంటే, కాల భైరవ సోదరుడు శ్రీసింహా కోడూరి సరసన 2023లో వచ్చిన ‘ఉస్తాద్’ సినిమాలో కావ్యనే హీరోయిన్. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కావ్య నటిస్తున్న ‘వాట్సాప్ నరేష్’ చిత్రం 2026లో విడుదలకు సిద్ధమవుతోంది.
►ALSO READ | ‘చిరైయా’ రివ్యూ: OTTకి వచ్చిన కొత్త వెబ్ సిరీస్.. భార్యతో బలవంతపు శృంగారం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అధికారిక ప్రకటన ఎప్పుడు?
ఇప్పటివరకు ఈ జంట గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ పెళ్లి వార్తలపై నోరు విప్పలేదు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో, త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి, కీరవాణి కుటుంబాల్లో జరగబోయే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి, టాలీవుడ్‌లో మరో మ్యూజికల్-యాక్టింగ్ జంట ఒక్కటి కాబోతుండటం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Manollani nenu chala sarlu theatres lo, Restaurants lo chusanu naku appude theda kottindhi. Relation lo unnaru ani ardhamaindhi. Finally Book launch event ki kalisi vaccharu. Andhariki Hint ivvadaniki 🥰🥰
Chudali e celebrate couple aina life long unte bagundu❤️❤️🥹🥹 pic.twitter.com/ILVGBRQ7pM
— Swaasthi (@swaasthi) March 24, 2026