July 15, 2026

Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!

Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!
Reading Time: < 1 minute
Indian Spy Movies Dhurandhar Border 2 Trending On Netflix Pakistan

Indian Spy Movies: దేశాల మధ్య రాజకీయ వైషమ్యాలు ఎలా ఉన్నా, కళకు ఎల్లలు లేవని పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ట్రెండ్ అవుతున్న టాప్-10 సినిమాల జాబితాలో మూడు ఇండియన్ సినిమాలు ఉండటం విశేషం. అందులోనూ ఆ మూడు చిత్రాలు పాకిస్థాన్ వ్యతిరేక నేపథ్యం, భారత గూఢచారుల సాహసాల చుట్టూ తిరిగేవి కావడం గమనార్హం. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్’ పాకిస్థాన్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ ఒక అండర్ కవర్ ఏజెంట్‌గా కరాచీ అండర్ వరల్డ్, ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి చొచ్చుకు వెళ్లే పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ఏకంగా 52 రోజులుగా నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్ ట్రెండింగ్ చార్టులో టాప్-5లో కొనసాగుతూ రికార్డు సృష్టిస్తోంది.

READ ALSO: Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్‌గా ట్రీట్‌మెంట్‌..

మరోసారి ‘బోర్డర్’ మ్యాజిక్..
1971 భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ‘బోర్డర్ 2’ కూడా పాక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత జవాన్ల శౌర్యప్రతాపాలను చూపించే ఈ సినిమా విడుదలైన వెంటనే టాప్-2 స్థానానికి చేరుకుంది. ఇక 2018లో విడుదలైన ఆలియా భట్ సూపర్ హిట్ చిత్రం ‘రాజీ’ ఇప్పటికీ పాక్ ఆడియన్స్‌లో క్రేజ్ తగ్గలేదు. గత 21 రోజులుగా ఈ సినిమా టాప్-10లో కొనసాగుతోంది. ఒక భారతీయ యువతి పాకిస్థాన్‌కు కోడలిగా వెళ్లి గూఢచారిగా ఎలా మారిందనే కథాంశం అక్కడి వారిని కట్టిపడేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్ టాప్-10 సినిమాలు ఇవే

పీకీ బ్లైండర్స్: ద ఇమ్మోర్టల్ మ్యాన్

బోర్డర్ 2

వార్ మెషిన్

అనోరా

ధురందర్

గ్లాడియేటర్ 2

మేడ్ ఇన్ కొరియా

వికెడ్

తల్వార్

రాజీ

బాలీవుడ్ చిత్రాల్లోని హై-ఓల్టేజ్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ పాక్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కథాంశం తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మేకింగ్, యాక్టింగ్ పరంగా భారతీయ సినిమాలకు అక్కడి జనాలు నీరాజనాలు పలుకుతున్నారని చెబుతున్నారు.

READ ALSO: Sarkar 4: రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్య రాయ్ అవుట్!