Reading Time: < 1 minute
Ram Charans Birthday Celebrations Will Be Grand On March 26 Peddi Teaser Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ రఫ్ అండ్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా రెండో సింగిల్ ‘రై రై రా రా’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా.. ముఖ్యంగా రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో క్రూషియల్ షెడ్యూల్‌తో బిజీగా ఉంది చిత్ర యూనిట్. నాలుగు రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుందని సమాచారం.

Also Read:

ఇక పెద్ది సినిమా నుంచి టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న పెద్ది టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, చరణ్ బర్త్ డేకి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పటి వరకు పెద్ది టీమ్ నుంచి టీజర్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మెగాభిమానులు మాత్రం ఈసారి తమ అభిమాన హీరో బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. మార్చి 26 సాయంత్రం నుంచి హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. నార్త్ అమెరికాలో మార్చి 26 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి పెద్ది సౌండ్ గట్టిగా ఉంటుందని నమ్ముతున్నారు మెగాభిమానులు.

Also Read: