Reading Time: 2 minutes
Indian Navy Agniveer Jobs 2026: ఇంటర్‌ అర్హతతో ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు.. అవివాహిత పురుష, మహిళలు అర్హులు

భారత త్రివిధ దళాల్లో ఒకటైన నౌకాదళంలో 2027 జనవరి/ ఫిబ్రవరి బ్యాచ్‌లకు అగ్నివీర్ సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐనెట్‌) ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్- ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో అర్హతతోపాటు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అవివాహితులై ఉండాలి. జనవరి 2027 బ్యాచ్ 1కు అభ్యర్ధలు డిసెంబర్, 2004 నుంచి 31 మే 2009 మధ్య జన్మించి ఉండాలి. ఫిబ్రవరి 2027 బ్యాచ్‌కు 1 మే, 2005 నుంచి 31 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి. నోటిఫికేషణ్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఏప్రిల్‌ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.550 చొప్పున చెల్లించాలి. ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌, రాత పరీక్ష, పీఎఫ్‌టీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో జనవరి బ్యాచ్‌కుకు డిసెంబర్‌ 2026లో, ఫిబ్రవరి బ్యాచ్‌కు మే 2027లో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి విధులు కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 ప్యాకేజీతోపాటు ఏటా నిర్ణీత ఇంక్రిమెంట్ ఉంటుంది. జీతంలో 30 శాతం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు వెళ్తుంది. వీరికి నాలుగు ఏళ్ల తర్వాత సేవా నిధి కింద మొత్తం రూ.10.04 లక్షలు అందుతాయి. స్టేజ్‌1 ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ మే 2026లో నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం

రాత పరీక్ష క్వశ్చన్‌ పేపర్ హిందీ లేదా ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. మొత్తం 50 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గంట వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.