
గోదావరి పండుగప్ప అంటే భోజన ప్రియులకు ప్రాణం. చేపలన్నింటిలో దీని రుచి ప్రత్యేకం. అందుకే దీనిని ‘చేపల రారాజు’ అని పిలుస్తారు. సాధారణంగా చిన్న సైజులో దొరికే ఈ చేప, ఏకంగా 20 కిలోల భారీ ఆకారంలో లభించడంతో దానిని గట్టుకు చేర్చడానికి మత్స్యకారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ భారీ చేపను చూడటానికి చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. మార్కెట్‌కు తీసుకురాకముందే ఈ పండుగప్ప కోసం పోటీ మొదలైంది. చివరకు 10 వేల రూపాయల భారీ ధర పలికినప్పటికీ, ఆ రుచి తెలిసిన మాంసాహార ప్రియులు ఏమాత్రం వెనకాడకుండా దీనిని దక్కించుకున్నారు. ఈ అదృష్టాన్ని దక్కించుకున్న వారు ఇంటికి తీసుకెళ్లి, గోదావరి స్టైల్‌లో మసాలాలు దట్టించి వండటంతో ఆ వీధి అంతా చేపల కూర వాసనతో నిండిపోయింది. “గోదావరి పండుగప్ప దొరికితే అది మత్స్యకారుడికి లాభం.. తిన్నవాడికి యోగం” అంటూ స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి ఈ భారీ పండుగప్ప యలమంచిలి తీరంలో ఒక చిన్నపాటి పండుగ వాతావరణాన్ని నింపింది.
మరిన్ని వీడియోల కోసం :
ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు