Reading Time: 2 minutes
Kuldeep Yadav Wedding Reception Lucknow Jadeja Feet Touching Video Viral

Kuldeep Wedding: భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను మార్చి 14న ముస్సోరీలో పెళ్లాడిన కుల్దీప్, మంగళవారం రాత్రి లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ఒక అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో కుల్దీప్, వంశిక జంట జడేజా దంపతుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. సీనియర్ల పట్ల కుల్దీప్ చూపిన ఈ గౌరవం, రివాబా ఎంతో ఆప్యాయంగా ఆ దంపతులను దీవించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

READ ALSO: Pakistan Crisis: పాకిస్థాన్‌పై ముప్పేట దాడి.. నూనె లేదు, పిండి లేదు.. తీవ్ర సంక్షోభంలో దాయాది దేశం..

తరలివచ్చిన ప్రముఖులు
ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు క్రికెటర్లు రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తదితరులు పాల్గొన్నారు.

వింటేజ్ కార్లో స్టైలిష్ ఎంట్రీ
ఈ రిసెప్షన్ వేడుకలో కుల్దీప్ యాదవ్ నలుపు రంగు సూట్‌లో మెరిసిపోగా, వంశిక క్రీమ్ కలర్ చీరలో ఎంతో హుందాగా కనిపించారు. ఈ జంట వేదిక వద్దకు వింటేజ్ ‘రోల్స్ రాయిస్’ కార్లో రాజసం ఉట్టిపడేలా ఎంట్రీ ఇవ్వడం విశేషం. 31 ఏళ్ల ఈ స్పిన్నర్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

READ ALSO: IPL 2026: కోహ్లీ వర్సెస్ రికార్డ్స్.. ఐపీఎల్‌లో నయా చరిత్రకు అడుగు దూరంలో కింగ్!