Reading Time: 2 minutes
Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. చివరకు సడన్‌గా.. షాకింగ్ వీడియో!

కదులుతున్న రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించవద్దని, అది ప్రాణాంతకం కాగలదని రైల్వే అధికారులు తరచుగా ప్రయాణికులను హెచ్చరిస్తుంటారు. అయితే, కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక తమ ప్రాణాలను పణంగా పెట్టే పొరపాటు చేస్తుంటారు. తాజాగా ఇలాంటిదే సోషల్ మీడియాలో ఒక దిగ్భ్రాంతికరమైన వీడియో వైరల్ అవుతోంది. అందులో, కదులుతున్న రైలు ఎక్కాలనే తొందరపాటు ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా, అకస్మాత్తుగా తన బాలెన్స్ కోల్పోయాడు. మహిళా కానిస్టేబుల్ సమయస్పూర్తితో.. తృటిలో మృత్యువు నుండి తప్పించుకున్నాడు.

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఆగి ఉన్న ఒక రైలు అకస్మాత్తుగా పట్టాలపై పరుగుల అందుకుంది. ఒక వ్యక్తి రైలు ఎక్కుతాడు, కానీ అతని వెనుక ఉన్న బోగీలోని మరో వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో రైలు వేగం కొద్దిగా ఎక్కువగా ఉండటంతో, ఆ వ్యక్తి రైలు ఎక్కుతున్నప్పుడు తన బాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో దిగ్భ్రాంతికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అతను ప్లాట్‌ఫారమ్ – రైలు మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తూ, ఒక మహిళా పోలీస్ అధికారి వెంటనే అక్కడికి చేరుకుని, సమయస్ఫూర్తితో అతని ప్రాణాలను కాపాడారు. దీంతో పెను విషాదం తప్పింది.

కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడిన ఒక వ్యక్తి ప్రాణాలను మన భారతీయ మహిళా పోలీసు ధైర్యంగా కాపాడింది’ అనే శీర్షికతో, @ExploreBharat47 అనే ఐడి ద్వారా ట్విట్టర్ (X) అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఒక నిమిషం 28 సెకన్ల వీడియోను 2,43,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. ఇందులో 4,000 మందికి పైగా దీనిని లైక్ చేసి, రకరకాల ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఒక యూజర్, “ఎంత అద్భుతమైన సమయస్ఫూర్తి, ధైర్యం! ఈ మహిళా కానిస్టేబుల్‌కు అభినందనలు.” అని రాశారు. రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఎందుకు ఖాళీ వదిలారని ఇతర యూజర్లు కూడా ప్రశ్నించారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..