Reading Time: < 1 minute
లైకా’నా మజాకా.. నేరుగా వెళ్లి బ్యాగ్ పక్కన నిల్చుకున్న డాగ్.. ఓపెన్ చేసి చూగడా

అప్పుడే విశాఖ రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన 58502 కిరండోల్ – విశాఖ పాసింజర్ ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆగింది. రైలు ఆగిన వెంటనే సిటీ పోలీస్ నార్కోటిక్ ట్రైన్డ్ లైకా తన పని ప్రారంభించింది. కంపార్ట్ మెంట్లలో బ్యాగులు, లగేజీ ని వెరిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంతలో ఓ దగ్గర ఆగి.. అక్కడ ఓ బ్యాగ్ ను ముమ్మరంగా తనిఖీ చేస్తోంది. ఎక్కడో అనుమానం.. ఒక్కసారిగా లైకా అరిచింది. అక్కడే ఉన్న హ్యాండ్లర్..ఆ అనుమాన్నాస్పద బ్యాగ్ ను ఓపెన్ చేసాడు. అంతే అందులో సుమారు 6 కేజీల గంజాయి బయటపడింది. దీంతో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్‌కు తరలించారు.

లైకా.. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన జాగలం. విశాఖ సిటీ పోలీస్ నార్కోటిక్ టీంలో అయిదు నెలల క్రితం చేరింది. మొత్తం ఏడు జాగిలాల్లో లైకా ఒకటి. శిక్షణ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న లైకా తన పని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్లో ఆగిన రైల్లో తనిఖీలు చేసి గంజాయి పసిగట్టి పట్టించింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో కీలకంగా పని చేస్తోంది లైకా.

రైల్లో గంజాయి స్మగ్లింగ్‌ను బయటపెట్టి పట్టించిన లైకాను అభినందించారు సీపీ బాగ్చి. లైకాతో పాటు డాగ్ హ్యాండ్లర్ ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. సీపీ చొరవతో కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవిఎంసికమిషనర్ సహకారంతో నార్కోటిక్స్ లో అదనపు శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దించామని అంటున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.