July 11, 2026

Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!
Reading Time: 2 minutes
Taurus Horoscope Vrishabha Rashi Predictions Finance Career And Remedies Are

Taurus Horoscope: పరాభవనామ ఏడాదిలో వృషభ రాశి వారికి 100% అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. దీనికి కారణం.. ఆదాయవ్యయాలతో పాటు గ్రహస్థితి కూడా కొంతవరకు సూచిస్తుంది గ్రహస్థితి వీరికి 100% బాగుంది. ఆదాయ వ్యయాలు గనుక చూసినట్లయితే.. ఆదాయం 5, వ్యయం 14. ఇక రాజపూజ్యం 5, అవమానము 4. కాబట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా సూచిస్తోంది. పరాభవనామ ఖర్చుల్ని జాగ్రత్తగా నియంత్రించాలి. ఆదాయం కంటే మించిన ఖర్చు ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం బాగుంది కాబట్టి సమాజంలో గౌరవము, మర్యాద బాగా ఉంటాయి.

Indore: భారీ అగ్ని ప్రమాదం.. బాలికతో పాటు ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి..!

ఇక కొత్త ఏడాది ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి స్థానంలో ఉన్న గురువు మంచి ఫలితాన్ని ఇస్తారు. కుటుంబ పరంగా, అలాగే ఆర్థిక పరంగా ఈ ఫలితాలు జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత ఆయన తృతీయంలోకి వెళ్తారు. అంటే వృషభ రాశి వారికి గురుబలం జూన్ లోపు అనుకూలంగా ఉంది. ఇక రాహువు రాజ్య స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి.

ఏడాది మొత్తం శని లాభస్థానంలో ఉన్నారు. లాభంలో శని ఉన్నప్పుడు కర్మకారకుడు. లాభంలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పనిలో దిగ్విజయం ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట యోగం డిసెంబర్ 7 నుంచి రాహువు భాగ్యంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్ చాతుర్యంతో పనులను చక్కబెడతారు.

Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

గురువు జూన్ నుండి మూడో ఇంట్లో మారడం వల్ల వృషభ రాశికి కర్కాటక రాశి తృతీయం అవుతుంది. కాబట్టి ఆ సమయం నుండి పనుల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత గురువు చతుర్థ స్థానంలోకి మారినప్పుడు కొద్దిగా కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. అయితే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా సంభాషించాలి. అలాగే ఈ సంవత్సరము వృషభ రాశి వారు దుర్గాదేవి స్తోత్ర పారాయణతో పాటు ఈశ్వరారాధన చేసినట్లయితే వారికి మేలైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.